సాధారణంగా చాలామంది దేవుడి ప్రతిమలున్న ఉంగరాలను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు.  మరీ ముఖ్యంగా ఆడవాళ్లు లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న ఉంగరాన్ని కచ్చితంగా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . తద్వారా లక్ష్మీదేవి వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ తాండవం చూస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉంటారు . కొందరు మెడలో చైన్లకు లాకెట్లుగా కూడా దేవుడు ప్రతిమ ధరిస్తూ ఉంటారు . దేవుడు ప్రతిమ ఉన్న ఉంగరాలను పెట్టుకోవడం తప్పులేదు . ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అలాంటి ఉంగరాలు పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు.  కానీ ఉంగరాలను ధరించగానే సరికాదు వాటికి తగినట్టు పద్ధతులు కూడా ఫాలో అవ్వాలి . అలా పాటించకపోతే పాజిటివిటీ కాస్త నెగిటివిటీగా మారిపోతుంది.  పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ గా మారి కొన్ని చికాకులు మన చుట్టూ తిరిగేలా చేస్తూ ఉంటుందట. చేతికి దేవుడు ప్రతిమ ఉన్న  ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!


*ఉంగరాన్ని ధరించే ముందు ఆలయాలలో తగిన పూజలు అభిషేకాలు వాళ్ళ జాతక నక్షత్ర ప్రకారం జరిపించాలి.

*అందరూ ఇలా చేయాలని కాదు కొందరికి జాతకాలలో దోషాలు ఉంటాయి .

*అందరికీ అన్ని దేవుళ్ళ ప్రతిమ ఉన్న ఉంగరాలు కలిసి రావు .

*అలా పూజలు చేసినప్పుడే వాటికి శక్తి లభించి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి .

*ఉంగరంలోని దేవుడి ప్రతిమ కాళ్లు చేతి గోళ్ళ వైపు తల మణికట్టు వైపు ఉండేలా పెట్టుకోవాలి. అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది .

*కళ్లకి ఆదుకునేటప్పుడు చెయ్యి గుప్పిట ముడిచి ఆదుకోవాలి.  

*ఎలా పడితే అలా దేవుడు ప్రతిమఉన్న ఉంగరాలను పెట్టుకోకూడదు.

*దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి మాంసాహారం తినరాదు .

*మరీ ముఖ్యంగా ఆడవారు చేతికి లక్ష్మి దేవి ప్రతిమ ఉన్న ఉంగరాన్ని పెట్టుకొని అదే చేత్తో మాంసాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు ..అదే చేత్తో మాంసం వండుతారు ..అదే చేత్తో మాంసం తింటారు. అలా చేయకూడదు.

*అంతేకాకుండా కొంతమంది చేతికి లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న ఉంగరం ఉన్నా కూడా ఆ చేతిని అన్నం తిన్నాక నాకుతూ ఉంటారు . అది మహా మహా తప్పు .

* ఆడవారి పీరియడ్ సమయంలో ఉంగరాలను లాకెట్స్ తీసేయడం మంచిది అంటున్నారు జ్యోతిష్య  పండితులు .

*మద్యం తీసుకునే వారు సిగరెట్ తాగే వారు ఉంగరం ధరించకపోవడమే ఉత్తమం.

ఈ నియమాలు పాటించకుండా దేవుడి ప్రతిమ ఉంగరాళ్లను పెట్టుకుంటే మనకి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైన పాఠించే ముందు ..మీరు విశ్వసించే పండితులను సంప్రదించడం ఉత్తమం అని గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: