నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కావలి ఒకటి...గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుంది. రెండు సార్లు వైసీపీ తరుపున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్‌...నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.

అటు కావలిలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం పథకాలు ఎమ్మెల్యే ప్రతాప్‌కు బాగా ప్లస్ అవుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కావలిలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇక కావలిలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి....కావలి పట్టణంలో తాగునీటి సమస్య, రూరల్ గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవు.

రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ ప్రతాప్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వ పథకాలు, మరో వైపు జగన్ ఇమేజ్ బాగా ప్లస్ అవుతున్నాయి. అటు టీడీపీ పరిస్తితి అసలు బాగోలేదు....మామూలుగానే కావలిలో టీడీపీ వీక్‌గా ఉంటుంది...గత ఎన్నికల నుంచి మరింత వీక్‌గా అయింది. పైగా సీనియర్ నేత బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్ళడంతో కావలిలో టీడీపీ కేడర్ వైసీపీ వైపుకు వచ్చింది. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఓడిపోయిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా పనిచేయడం లేదు.

అటు టి‌డి‌పి నేత బీదా రవిచంద్రాయాదవ్ జిల్లాలో పార్టీ తరుపున కార్యక్రమాలు చేస్తున్నారుగానీ, కావలిలో మాత్రం అంత దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో కావలిలో టీడీపీకి పుంజుకోవడం లేదు...అదే ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్లస్ అవుతుంది..ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతాప్ గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు. మొత్తానికి కావలిలో ప్రతాప్‌కు తిరుగులేదని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: