‘గూఢచారి’ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన శోభిత ధూళిపాళ గత కొన్ని రోజులుగా తనను మాటలతో టార్గెట్ చేస్తున్న మహేష్ అభిమానులకు షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. మహేష్ చేసిన ట్విట్ కు తాను 'థ్యాంక్ యూ' చెప్పడం పై రేగిన వివాదం పై ఆమె మహేష్ సూపర్ స్టార్ స్టేటస్ పై కామెంట్స్ చేయడం మహేష్ అభిమానులకు అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 
Sobhita-Duhipala
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ  "సార్/ సూపర్ స్టార్/ద గ్రేట్  అనే పదాలను తాను ఆస్టార్ హీరోల పేరు ముందు వాడననీ అందువల్లనే తాను 'థ్యాంక్ యూ'' అన్న పదాన్ని వాడినట్లు ఆమె వివరణ ఇచ్చింది. ‘థ్యాంక్ యూ’ అన్న పదంలో ఉన్న అగౌరవం ఏమిటో తనకు అర్ధం కావడం లేదు అని అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరికీ ఎటువంటి సేఫ్టీ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
Sobhita-Dhulipala
మహేష్ పట్ల తనకు గౌరవం ఉన్నమాట నిజం అని చెపుతూ ఒక వ్యక్తి పట్ల గౌరవం వ్యక్తపరచాలి అంటే ఆవ్యక్తికి ఉన్న బిరుదులతో విశేషణాలతో కలిపి ఆవ్యక్తిని పిలవాలా అంటూ ఒక కొత్త లాజిక్ ను ప్రవేశపట్టింది శోభిత. ఒకవైపు మహేష్ పట్ల తనకు గౌరవం అంటూ మరొకవైపు తాను మహేష్ భిరుదులను పట్టించుకొను అంటూ శోభిత చేసిన కామెంట్స్ చాల వ్యూహాత్మకంగా కనిపిస్తున్నాయి.
Sobhita Dhulipala talks about her role in Anurag Kashyap’s Raman Raghav 2.0
ఇప్పటికే శోభిత పట్ల కోపంగా ఉన్న మహేష్ అభిమానులు ఈమె లేటెస్ట్ గా ఇచ్చిన ఈ షాకింగ్ రిప్లయ్ ని చూసి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా హీరోయిన్ గా నిలబడకుండానే శోభిత ఒక టాప్ హీరో అభిమానులతో వాదనకు దిగడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: