తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ హీరోల వారసులు కూడా చాలా మంది హీరోలుగా పరిచయం అవుతారు. అలా ఇప్పటికే చాలా మంది యువ హీరోలు ఇండస్ట్రీ కి వచ్చి నిలదొక్కుకున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కూడా రాబోతున్నాడు. బాలకృష్ణ నందమూరి తారక రామారావు కొడుకే అయినా సినిమాల్లో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక మాస్ హీరోగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.


ఇప్పుడు తనయుడు మోక్షజ్ఞ ను కూడా అదే స్థాయిలో తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారట బాలకృష్ణ. కుమారుడి ఎంట్రీ పై బాలకృష్ణ ఓ క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే ఓ కథ ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అంతే కాదు అన్ని కుదిరితే ఈ సినిమాకు బాలకృష్ణనే దర్శకత్వం వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినబడుతోంది. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమాకు స్వయంగా తానే దర్శకత్వం చేస్తాననడం నిజంగా బాలయ్య అభిమానులకు ఒక పెద్ద పండుగే అని చెప్పాలి. తమ అభిమాన హీరో వారసుడి మొదటి సినిమా ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఎం.బి.కె ఫ్యాన్స్.


ఇలాంటి సందర్భంలో బాలయ్య కొడుకు అరంగేట్రం గురించి ఓ క్లారిటీ ఇవ్వడం బాలయ్య అభిమానులకు ఓ శుభవార్తే అని చెప్పాలి. మరి ఆ శుభ ముహూర్తం ఎప్పుడు వస్తోందో చూడాలి మరి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదలైంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా తరువాత కె.ఎస్.రవికుమార్ తో ముచ్చటగా మూడోసారి కలసి పనిచేయనున్నట్లు సమాచారం. అయితే దానిపై కచ్చితమైన క్లారిటీ ఇంకా రాలేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: