
సినీ ఇండస్ట్రీలో కొంత మంది ఏళ్ళ తరబడి శ్రమించినా ఫలితం ఉండదు. కానీ మరికొంతమందికి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ని తెచ్చిపెడుతున్నాయి. మరికొన్ని సినిమాలు హిట్, ఫ్లాప్ లు ద్వారా సినీ ఇండస్ట్రీలో కొందరి జీవితాలను మార్చేస్తూ ఉంటాయి. అలా ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా అవకాశాలు రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు సక్సెస్ గా ఉన్నప్పుడే కొంత సొమ్ము వెనకేసుకునే ఆలోచనలో ఉన్నారు హీరోలు.అలాంటి వారిలో తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1). కార్తీ
తమిళ సీనియర్ నటుడు శివకుమార్ రెండో కొడుకు కార్తీ. సూర్య, జ్యోతిక కూడా నటులే..అమెరికా లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కార్తీ సినిమా యాక్టింగ్ లో కోర్సులు పూర్తి చేసిన అనంతరం ఇండియాకు వచ్చి, మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తరువాత హీరోగా మారాడు. ఇప్పటి వరకు అతను 20 పైగా సినిమాల్లో నటించి, టాప్ హీరోగా ఎదిగాడు.ఆయన ఒక్కో సినిమాకి 8 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
2). విజయ్ సేతుపతి
పేద కుటుంబం నుంచి వచ్చిన విజయ్ సేతుపతి, కుటుంబాన్ని పోషించడం కోసం మొదట్లో సిమెంట్ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించేవాడు. 2003లో ఒక అకౌంటెంట్ గా పని చేశాడు.మరోవైపు సినిమాల్లోని ప్రయత్నిస్తూనే, తొలి సినిమాలోనే చిన్న క్యారెక్టర్ చేశాడు. సీరియల్ లో కూడా నటించాడు. ఎంతో మంచి హీరోగా ఎదిగాడు. బెస్ట్ విలన్, బెస్ట్ హీరో అవార్డులు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఒక సినిమాకి 8 నుంచి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
3). ధనుష్
ప్రముఖ దర్శకుడు, ప్రొడ్యూసర్ అయిన కస్తూరి రాజాన్ కుమారుడే ఈ ధనుష్. తన అన్న అయినటువంటి సెల్వరాఘవన్ కూడా దర్శకుడే. ధనుష్ ను హీరోగా పరిచయం చేశాడు. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్నాడు. ధనుష్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయలు వరకూ తీసుకుంటున్నాడు.
4). సూర్య
సీనియర్ తమిళ నటుడు శివకుమార్ వారసుడు ఈ సూర్య.తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.హీరో కావడంతో సినీ అవకాశాలు ఈజీగానే వచ్చేశాయి. అయితే తన నటనతో మంచి హీరోగా గుర్తింపు పొంది, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు సూర్య. ఈయన ఒక్కో సినిమాకి 20 నుంచి 22 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ కింద
తీసుకుంటున్నాడు.
5). కమల్ హాసన్
ఈయన ఎంత పెద్ద నటుడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు రాజకీయ పార్టీ స్థాపించి, పొలిటిక్స్ చేస్తున్నాడు కమలాసన్. ఒక్కో సినిమాకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకున్నాడు.
6). అజిత్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో అజిత్. భయం ఉంటుంది అనే సూపర్ హిట్ తో టాప్ హీరో గా కొనసాగుతూనే ఉన్నాడు. కమల్, రజనీ తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్స్ సంపాదించుకున్న హీరో అజిత్. ఈయన ఒక్కో సినిమాకి 42 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.
7). విజయ్
ఇతని ఫ్యామిలీ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నది. ఈయన తండ్రి చంద్రశేఖర్, దర్శకుడు తల్లి ప్లే బ్యాక్ సింగర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో పరిచయమైన వ్యక్తి. ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాడు. రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో విజయ్. ఈయన ఒక్కో సినిమాకి 45 నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.
8). రజినీకాంత్
సౌత్ ఇండియా లోనే కాదు యావత్ భారతదేశం అంతటా త్రికాలములు కలిగి ఉన్న ఏకైక హీరో రజినీకాంత్. అంతే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. ఒక్క సినిమాకు 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో లలో రజినీకాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.