కోవిడ్ దెబ్బకు థియేటర్లు మూతపడడంతో... ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు, పలు సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తూ ఇంట్లోనే ప్రేక్షకులకు వినోదం అందించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి కాంబోలో మ‌ల‌యాళ సైకలాజికల్ థ్రిల్లర్‌ 'అతిరన్‌'సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో 'అనుకోని అతిథి'గా రీమేక్ చేసి ఓటీటీలో ఈరోజు విడుదల చేశారు. మలయాళం లోనే కాదు తెలుగులో కూడా క్రేజ్ పెంచుకుంటున్న ఫాహాద్ ఫాసిల్ హీరోగా నటించే సరికి ఈ సినిమా మీద తెలుగులో క్రేజ్ వచ్చింది.

అయితే ఈ సినిమా  ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ఇది.  సైక్లాజికల్‌ థ్రిల్లర్‌ అయినా హరర్‌ ఎలిమెంట్స్‌ని మిక్స్‌ చేసి సరికొత్త అనుభూతిని అందించడంలో కొంతమేర దర్శకుడు వివేక్‌ సఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా ఎండింగ్‌ వరకు సస్పెన్స్‌ను రివీల్‌ చేయకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించాడు. ఫస్టాఫ్‌ ఇంట్రడక్షన్, కొన్ని టిస్టులతో నడిపించిన డైరెక్టర్‌ అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. నేచూరల్‌ బ్యూటీ సాయిపల్లవి తొలిసారి మానసిక రోగి పాత్రలో నటించింది.  నిత్య పాత్రలో ఆమె పరకాయప్రవేశం చేసింది. డైలాగులు లేకుండా కేవలం తన హావభావాలతో కథను నడిపించింది.  సైకాట్రిస్ట్‌ నందాగా పహద్‌ ఫాజిల్‌ అద్భుతంగా నటించాడు.

నెగెటివ్‌ షేడ్స్‌ కలిగిన డాక్టర్‌ బెంజమిన్‌ పాత్రకు అతుల్‌ కులకర్ణి న్యాయం చేశాడు. ప్రకాశ్‌ రాజ్‌, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక ఈ సినిమా మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం. జీబ్రాన్‌ తన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అను మోతేదత్‌ కెమెరా పనితనం బాగుంది. అడవి లొకేషన్స్‌ని అద్భుతంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.థ్రిల్లర్ సినిమాలని నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: