ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత మరియు రచయిత అయినటువంటి కోన వెంకట్ రెడీ, గీతాంజలి, డీ, శివమణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో సినిమాలకు సంభాషణలు రాసి ఆ చిత్రాలు విజయం సాధించడంలో కీలకమయ్యారు. ఈయన ఎంతో మంది నటీనటులకు సినీ జీవితం ఇచ్చారనే చెప్పాలి. వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. గీతాంజలి సినిమా ద్వారా అంజలికి మంచి బ్రేక్ ఇచ్చారు ఈ నిర్మాత. అప్పట్లో ఆమె కెరియర్ కాస్త డౌన్ అయిన సమయంలో గీతాంజలి చిత్రం అంజలికి ఎంతగానో ప్లస్ అయింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి కాస్త ఆఫర్లు తక్కువనే చెప్పాలి. ఇటీవలే అలరించిన అంజలికి ఇప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యాడట రచయిత మరియు నిర్మాత కోన వెంకట్.

ఈయన నిర్మించబోతున్న తదుపరి ప్రాజెక్టు లో అంజలికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోన వెంకట్ మేనేజర్ అంజలిని సంప్రదించి విషయం చెప్పారని ఆమె కూడా ఇందుకు అంగీకరించినట్లు  తెలుస్తోంది. ఇందులో అంజలి రోల్ పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇది కనుక నిజమైతే అంజలి కెరియర్ కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడేలా ఉంది. మళ్లీ ఈ భామ ఫుల్ బిజీ అవుతుందా లేదా చూడాలి.

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ భామ. ఒకప్పట్లో వరుస అవకాశాలతో దూసుకు పోయింది. అగ్ర హీరోలందరి సరసన నటించి  సాహో హీరోయిన్ గా మన్ననలను పొందింది. అయితే ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో మళ్లీ అభిమానుల్ని అలరించింది. అయితే ఈ సినిమా ఇచ్చిన హిట్ టాక్ తో తిరిగి మళ్లీ బిజీ కావాలని ప్రయత్నిస్తోందట ఈ అచ్చ తెలుగు అమ్మాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: