టాలీవుడ్ సినిమా పరిశ్రమ మాత్రమే కాదు ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరో ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హీరో లు ఏది చెబితే అదే జరగాలి. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో హీరో పాత్ర తప్పకుండా ఉంటుంది. చిన్న పాత్ర చేసే నటుల దగ్గర నుంచి హీరోయిన్ పాత్ర వరకు ప్రతి ఒక్క నటీనటులను కూడా హీరో దృష్టిలోనే ఎంపిక జరుగుతుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం హీరోలనే డామినేట్ చేస్తూ వారిని శాసిస్తుంది. ఆమె ఎలాంటి స్టార్ హీరో సినిమాలోనైనా నటించాలని అంటే కొన్ని కండిషన్స్ పెడుతుంది. దానికి సదరు స్టార్ హీరోలు ఒప్పుకోక తప్పలేదు. ఆమె ఎవరో కాదు నయనతార.

సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కొన్నేళ్ల నుంచి సినిమా పరిశ్రమను శాసిస్తున్న నయనతార తొలుత చిన్న చిన్న సినిమాలతోనే ప్రేక్షకులముందుకు వచ్చిన ఆ తర్వాత భారీ సినిమాలను చేస్తూ స్టార్ హీరో కి ఉన్న క్రేజ్ న సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించడం మొదలుపెట్టింది. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ తో పాటు స్టార్ హీరోకి సమానంగా మార్కెట్ ఏర్పడింది. ఆమె నటించిన ప్రతి సినిమా సౌత్లో వారిని భాషలలో విడుదల అవుతుండడం చూస్తుంటే దక్షిణాదిన ఆమెకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ స్టార్ హీరో తో నటించాలన్న చాలా కండిషన్స్ పెడుతుందట. మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పక్కన నటించడానికి కూడా ఆమె కండిషన్లు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ముట్టు కాకుండా పక్కన యాక్ట్ చేయాలని, సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటానని కరాఖండిగా చెప్పేసిందట నయనతార. చిన్న హీరోలు అయితే పర్వాలేదు కానీ టాలీవుడ్ లోనే టాప్ స్టార్స్ గా ఉన్న వెంకీ చిరు ల తో కూడా ఈ కండిషన్స్ అప్లై చేస్తుందట. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇవన్నీ భరించక తప్పట్లేదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా కూడా ఈ కండిషన్ అప్లై చేసిందట. ఓ సారి షూటింగ్ కి ఆలస్యంగా రావడం వల్ల సైరా సినిమా జాప్యం జరిగిందని అప్పట్లో చిత్ర బృందం ఆమె పై ఫైర్ అవడం మనకు తెలిసిందే అయినా ఆమెలో మార్పు రాకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: