హిందీ ప్రేక్షకుల నేటి మహానటి ఆమె,  నిన్నటి  తరం ప్రేక్షకులకు  సౌందర్య రాశి ఆమె,  హిందీలో సహజనటి అంటే ఆమె,  తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా  హిందీ సినీ హృదయాలను ఆకట్టుకున్న గొప్ప నటనా చాతుర్యం అమెది.  సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల వైపే ఆమె  ప్రయత్నాలు సాగాయి.  


అందుకే ఆమె నటన ఓ  సహజత్వం,  ఆమె అందం సహజసిద్ధం,   హిందీలో సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు  'కాజోల్'.  ఎన్నో సినిమాల్లో,  మరెన్నో పాత్రల్లో  హిందీ  మహానటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన  ఫ్యామిలీ  హీరోయిన్ 'కాజోల్'.  ఆ రోజుల్లో  కరిష్మా కపూర్, సుష్మితా సేన్,  శ్రీదేవి లాంటి మహా మహా  అందగత్తెలు  గట్టి పోటీ ఇచ్చినా..


హిందీ వెండితెర పై   తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాలెంట్ కాజోల్ ది.  ఇప్పటికీ కొత్త తరహ పాత్రలతో  హిందీ ప్రేక్షకులను  అలరిస్తూనే ఉంది.  బాలీవుడ్ లో  అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.   అతి తక్కువ సమయంలోనే  100కు పైగా చిత్రాలలో లీడ్  హీరోయిన్ గా నటించి తనకంటూ  ప్రత్యేక  అభిమానులను సంపాదించుకుంది.


కాజోల్  కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలని చాలా కష్టపడిందట. అయితే, ఆమెకు   మొదట అవకాశాలు ఇవ్వలేదు. నల్లగా ఉంది, ఈమె హీరోయిన్ ఏమిటి ? అన్నవాళ్ళే..  రెండేళ్ళు  తిరిగేసరికి  హీరోయిన్ అంటే..  ఈమె.. అనే స్థాయికి చేరింది కాజోల్.  విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది.  కెరీర్ లో  అంచెలంచెలుగా ఎదిగింది.  

అయితే, కాజోల్ కొత్త అవతారం ఎత్తబోతుంది. ఆమె నిర్మాతగా మారబోతుంది. ఇప్పటికే కథను కూడా ఫైనల్ చేసింది.  త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా  ప్రకటించనుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో నటించే చాన్స్ ఉంది అట.      

   
 

మరింత సమాచారం తెలుసుకోండి: