ఎవ్వ‌రు అయినా సినీ ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకుంటే ఇందుకు టాలెంట్‌తో పాటు స్ట‌యిల్‌, లుక్‌, ఫిట్‌నెస్‌తో పాటు ముఖ్యంగా మంచి న‌ట‌న ఇలా అన్నీ ఉండాలి. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డితే కానీ అప్పుడు ఏదో ఒక సినిమాలో ఛాన్స్ రాదు. అలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే న‌టీమ‌నుల‌లో సారా అలీఖాన్ ఒక‌రు. 96 కేజీల బ‌రువు ఉన్న సారా అలీఖాన్ సినిమాల్లోకి రావ‌డానికి చాలానే క‌ష్ట‌ప‌డింది. ఆమె బ‌రువు త‌గ్గ‌డం ద్వారా ఇప్పుడు త‌న రూపాన్ని మెరుగుప‌రిచి మార్చుకున్న‌ది. నేడు ఆమె ఒక విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతుంది. సారా అలీఖాన్ లైఫ్ స్ట‌యిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌, న‌టి అమృత‌సింగ్ పెద్ద కుమార్తె సారా అలీఖాన్‌. అమీర్‌ఖాన్ చాలా చిన్న వ‌య‌స్సులోనే ఎన్నో విజ‌య‌వంతమైన చిత్రాల‌ను అందించారు. సారా అలీఖాన్ 96 కిలోల బ‌రువున్న‌ప్పుడు వ్యాయామం, జిమ్‌, వ‌ర్క‌వుట్ ద్వారా ఆమె త‌న బ‌రువును దాదాపు 40 కిలోల‌కు పైగా త‌గ్గించిన‌ది. బ‌రువు త‌గ్గిన స‌మ‌యం నుంచే సారా అలీఖాన్ త‌న ఆహారం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ది. ఫొటో షూట్‌, స‌మ‌యంలో ఆకుకూర‌లు, వేడి నీటిని మాత్ర‌మే తీసుకున్న‌ది. ఆమె అల్పాహారం, భోజ‌నం, వింధు కోసం గుడ్లు, ఇంకా చికెన్ మాత్ర‌మే తినేది.  ముఖ్యంగా సారా అలీఖాన్ సినీ జీవితం గురించి చ‌ర్చించితే.. 2018లో ఆమె కేదార్‌నాథ్ చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. దీని త‌రువాత సారా సింబా, ల‌వ్ ఆజ్ క‌ల్‌, కూలీ నెంబ‌ర్ వ‌న్ వంటి హిట్ చిత్రాల‌లో న‌టించింది.

సారా అలీఖాన్ ఐఫా బెస్ట్ ఫీమెల్ డ‌బ్య్ల్యూ స్టార్ అవార్డును కూడా అందుకున్న‌ది. కేదార్‌నాథ్ చిత్రానికి ఈ అవార్డు ల‌భించింది. సారా అలీఖాన్ న‌ట‌న‌, నృత్యమంటే అభిమానుల‌ను ఎంతో ఇష్టం. సారాకు  టెన్నీస్ ఆడ‌టం, ఢ్యాన్ చేయ‌డం చాలా ఇష్ట‌మ‌ట‌. సోష‌ల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె త‌న అభిమానుల కోసం ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది.

సారా అలీఖాన్ కార్ల క‌లెక్ష‌న్ గురించి చెప్పాలంటే ఆమె వ‌ద్ద చాలా ల‌గ్జ‌రీ అండ్ ఖ‌రీదైన కార్లున్నాయి. వీటిలో రేంజ్ రోవ‌ర్ ఎవోక్ హోండా సీఆర్వీ రూ.32ల‌క్ష‌లు వంటి కార్లున్నాయి. సారా అలీఖాన్ త‌న త‌ల్లి అమృత‌సింగ్ సోద‌రుడు ఇబ్ర‌హీంతో క‌లిసి ముంబైలోని జుహులోని ఒక విలాస‌వంత‌మైన ఇంట్లో నివ‌సిస్తున్నారు. ఇంట్లో పెద్ద హాల్‌, పెద్ద గ‌దులు, కిచెన్‌, పెద్ద స్విమ్మింగ్ పుల్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఇంట్లో ప్ర‌తీ సౌక‌ర్య‌ముంటుంది. ముఖ్యంగా మీడియా నివేదికల ప్ర‌కారం.. ఆమె నెల ఆదాయం 3లక్ష‌ల‌కు పై మాట అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇటీవ‌లే సారా త‌న‌కు కాబోయే భ‌ర్త ఇల్ల‌రికం రావాల‌ని.. తాను ఎప్పుడు అమ్మ‌తోనే ఉంటాను అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: