క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి, ఆయన క్రియేట్ చేసిన రికార్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి అది అర్థం అవుతుంది. కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించారు మహేంద్రసింగ్ ధోని. 2011 వ సంవత్సరంలో వరల్డ్ కప్ సాధించడంలో ధోని దే ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు. అయితే ఎంఎస్ ధోని యొక్క ఆస్తి విలువ ఎన్ని కోట్లో అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహేంద్రసింగ్ ధోని ఫ్యామిలీ హిందూ రాజ్ పుత్ ఫ్యామిలీ.. ఈయన జార్ఖండ్ లో జన్మించారు. ధోని స్కూల్ వయసులోనే బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ ఎంతో అద్భుతంగా ఆడేవారట. ఫుట్ బాల్ లో ధోని గోల్ కీపరట. కానీ ఒకసారి సరదాగా క్రికెట్ ఆడదామని వెళ్ళినప్పుడు.. క్రికెట్ ఆడకుండా కేవలం వికెట్ కీపర్ గానే ఆడాడట.. అలా వికెట్ కీపర్ గా ఆసక్తి పెరగడంతో కమాండర్ కోచ్ టీంకి వికెట్ కీపర్ గా జాయిన్ అయ్యారట. ఇక ధోని కి ఒక అన్న, ఒక అక్క కూడా ఉన్నారట.. ఇక 2010వ సంవత్సరంలో సాక్షి సింగ్ ని వివాహం చేసుకున్నారు ధోని.

ఇక ధోని కి ఒక కూతురు కూడా ఉంది తన పేరు జీవ. మహేంద్రసింగ్ ధోని ఎన్నో వాటికి  బ్రాండ్  అంబాసిడర్ గా  కూడా చేశారు. ధోని ఈ ప్రపంచంలోనే సెకండ్ రిచ్చెస్ట్ ప్లేయర్ గా పేరు పొందారు. ధోని ఆస్తి విలువ దాదాపుగా రూ.800 వందల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ధోనికి రాంచీలో ఒక లగ్జరీ హౌస్ ఉన్నది.. ఈ ఫామ్ హౌస్ ధర దాదాపుగా రూ.20 కోట్లు ఉంటుందట. ధోని దగ్గర దాదాపుగా రూ.12 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నవి.. ధోని దగ్గర రూ.3 కోట్ల విలువచేసే వాచ్ లు ఉన్నాయి. ధోని ఒక చారిటబుల్ ట్రస్టు కూడా ఓపెన్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: