సాధారణంగా భారత దేశానికి చెందిన నటులు తమ తమ ఇండస్ట్రీస్ లో సూపర్ స్టార్స్ గా వెలుగొందుతారు కానీ ఆ బాలీవుడ్ నటుడు ఏకంగా బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా? అసలు బాలీవుడ్ వదిలి ధాలీవుడ్ ఎందుకు వెళ్ళాడు ?   .



చుంకీ పాండే బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. యుంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నటించిన సాహా చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించారు . 80 వ దశకం చివరి నుంచి 90 వ దశకం మధ్య వరకు విజయవంతమైన హీరోగా , అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలుగొందిన నటుడు ఇతను. తన ముందు తరం, తన తరం మరియు తన తరవాత తరం హీరోలతో అత్యధిక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన నటుడిగా రికార్డు సృష్టించారు. 



చుంకీ పాండే అసలు పేరు సూయశ్ పాండే. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జన్మించారు.ఇతని తండ్రి శరద్ పాండే భారత దేశానికి అత్యుత్తమ గుండె శస్త్రచికిత్స నిపుణులు.  గుండెకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు కొన్ని వేలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. ప్రముఖ సామాజిక సేవకురాలు మథర్ తెరిస్సా కు అత్యంత కావాల్సిన వ్యక్తుల్లో శరద్ ఒకరు. పాండే తల్లి స్నేహలత సైతం వైద్యురాలు. 

 

చిన్నతనంలో తల్లిదండ్రులు లాగే డాక్టర్ అవ్వాలని తపించిన పాండే , స్కూల్ ఫైనల్ నాటికి సినిమాల పట్ల ఆకర్షితుడై ఉన్నత విద్యను పూర్తి చేసి యాక్టింగ్ స్కూల్ లో నటన తో పాటుగా పలు విభాగాల్లో శిక్షణ పొందారు, తర్వాత అక్కడ కొంత కాలం పనిచేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వంటి తదితరులు సైతం పాండే నట శిక్షణ లో రాటుదెలారు. 



పాండే 1987లో వచ్చిన ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా మల్టీస్టారర్  ఆగ్ హై ఆగ్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో కి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అప్పటి వర్తమాన నటి తర్వాత కాలంలో ప్రముఖ హీరోయిన్ నీలం కొఠారి సరసన నటించారు. తర్వాత కాలంలో వరసగా సన్నీ డియోల్ , అనిల్ కపూర్ వంటి హీరోలతో నటించిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 1994 వరకు బాలీవుడ్ లో తన జైత్రయాత్ర కొనసాగించారు. 



1994 తర్వాత తను నటించిన పలు చిత్రాలు వరుస పరాజయాలు తో పాటుగా షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ , సల్మాన్ ఖాన్ వంటి పలువురు హీరోలు విజయవంతం కావడంతో పాండే కు బాలీవుడ్ లో అవకాశాలు సన్నగిల్లిపోతూ వచ్చాయి. ఈ సమయంలో నే బంగ్లాదేశ్ లోని ధాలీవుడ్ లో అవకాశాలు రావడం తో అక్కడ కి వెళ్ళి నటించిన మొదటి చిత్రమే ఘనవిజయం సాధించి అనూహ్యంగా  పాండే కు ఆ దేశంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. 1995-97 మధ్యలో నటించిన 6 చిత్రాలు అక్కడ ఘనవిజయం సాధించి తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.  



1997 తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ధాలీవుడ్ నుంచి తిరిగి బాలీవుడ్ చేరినా హీరోగా అవకాశాలు సన్నగిల్లిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వరుస సినిమాలతో ఇప్పటికి బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాల్లో , ఇటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. 



పాండే వ్యక్తిగత జీవితంలో కి వస్తే సోదరుడు చిక్కి పాండే సైతం బాలీవుడ్ నటుడిగా రాణింస్తున్నారు. పాండే 1998లో భావనా పాండే ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు , ప్రముఖ యువ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇతని పెద్ద కుమార్తె. 

మరింత సమాచారం తెలుసుకోండి: