సినిమా పరిశ్రమలో వయసు పెరిగే కొద్ది అవకాశాలు తగ్గుతాయని అందరూ అనుకునే వారు కానీ ఇప్పుడున్న పెద్ద హీరోల విషయంలో అది నిజం కాదు. వయసు పెరుగుతున్నా కూడా వారు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా నలుగు ప్రాజెక్ట్ లను ముందు ఉంచుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య విడుదల కాగా, గాడ్ ఫాదర్ , భోలా శంకర్ సినిమాల షూటింగ్ లు ఒకేసారి చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో సినిమా మరియు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అటు బాలకృష్ణ కూడా రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఆ తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నాడు వెంకటేష్, రవితేజ, నాగార్జున వంటి హీరోలు కూడా వరుస సినిమాలతో యువ హీరోలకు మంచి పోటీ ని ఇస్తున్నారు. అయితే వరుస సినిమాలు అయితే చేస్తున్నారు కనీ ఈ హీరోలకు ఓ సమస్య మాత్రం ఎదురవడం వారికి ఎంతో ఇబ్బంది ని కలిగిస్తుంది.

వీరు చేసే సినిమాల హీరోయిన్ ల విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వెంకటేష్ లకు హీరోయిన్ లను ఆ సమయానికి ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతా యువ హీరోయిన్ లే వచ్చిన నేపథ్యంలో వారికి సరిజోడు కోసం చాలామంది ని పరిశీలించాల్సి వస్తుంది. అయితే రవితేజ లాంటి మరో సీనియర్ హీరో శ్రీ లీల వంటి కుర్ర హీరోయిన్ తో నటిస్తున్నప్పుడు వీరు కి ఎందుకు ఈ ఇబ్బంది ఎదురవుతుందని కొంతమంది చెప్తున్నారు. మరి భవిష్యత్తులో వీరు కుర్ర హీరోయిన్ లతో నటించే సాహసం చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే ట్రోలింగ్ లు బాగానే వస్తాయి అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: