గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఇక్కడ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందచందాలతో అందరినీ ఎంతగానో అలరించింది. 2006వ సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసుకోగా ఆ సినిమాలో ఆమె గ్లామర్ ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చేలా చేసింది. అలా ఆ వెంటనే మహేష్ బాబు జోడిగా పోకిరి సినిమా చేయగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

 ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. టాలీవుడ్లో ఓ దశాబ్దకాలంపాటు అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈమె మంచి సినిమా అవకాశాలు చేతిలో ఉన్నప్పుడే బాలీవుడ్ కి మకాం మారింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు అనే చెప్పాలి. వరుస సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడం ఆమె ఇమేజ్ పెంచ లేకపోయాయి. దానికి తోడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా ఆమెను పట్టించుకోలేదు ఎవరు.

దాంతో సినిమా లను పక్కనపెట్టి కొన్నిరోజులు ప్రేమాయణం నడిపించింది కొన్నాళ్ల తన ప్రియుడు తో డేటింగ్ చేసిన ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయి బ్రేకప్ అయిన తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేసి సినిమా ఆఫర్లు అందుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఈమె ఫోటో షూట్ లతో అందరినీ ఎట్రాక్ట్ చేయాలని చూసింది. కానీ ఆమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ ఆల్బమ్ సాంగ్ చేయడానికి ఆమె సిద్ధమయింది. అందులో భాగంగానే త్వరలోనే ఈ పాటకు సంబంధించిన షూట్ మొదలు కాబోతుంది. మరి ఆ ఆల్బమ్ సాంగ్ అయినా ఆమెకు కలిసి వచ్చి మరిన్ని సినిమా అవకాశాలను తీసుకు వస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: