టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ విజయశాంతి. ప్రస్తుతం అయితే రాజకీయాల్లో బిజీ అయిపోయారు కానీ అప్పట్లో క్షణం తీరక లేకుండా సినిమాలతో బిజీగా ఉండేవారు.  ఈమెకు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్నేళ్లు సినీ ప్రపంచాన్ని ఏలిన హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. అయితే నటి విజయశాంతి కి ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్షిప్ లేకపోవడం గమనార్హం. హీరోయిన్ గా కాకపోయినా ఇప్పటికీ ఇండస్ట్రీతో తన బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇలా ఇప్పటికీ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈమె  ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ గా లేకపోవడం అంటే ఆశ్చర్యకరమైన విషయమే.

అయితే ఇలా ఇప్పటి వరకు కార్డ్ తీసుకోకుండా ఉండటానికి కారణం ఉందా అంటే అవుననే అంటున్నారు మరో ప్రముఖ నటుడు.  ఈ విషయం పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సీవీఎస్ నరసింహారావు . అందరికీ  ఆత్మాభిమానాలు, ఇష్టాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి బాబు మోహన్, విజయశాంతిలకు ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఉందని అయితే తెలంగాణవాదం వలన ఆమెకు నష్టం వాటిల్లింది అని సీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. వజ్రోత్సవాలకు ఇన్విటేషన్ అందలేదని ఆయన విమర్శలు గుప్పించాడు. ఆ రకంగా నటి విజయశాంతి ని అవమానించారని సీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.

లేడీ అమితాబ్ అంటారని ఇంకోటి ఇంకోటి అంటుంటారు అని ఆయన కామెంట్లు విసిరారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న సెటిలర్లు అంతా ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని నేను చెబితే పరిస్థితి ఎలా ఉంటుంది అని అన్నారు. వాస్తవానికి మూవీ అసోసియేషన్ లో  చేరాలని విజయశాంతి కి ఉందని అయితే .... తెలంగాణ వాళ్లలో చాలామంది మెంబర్ షిప్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయినా సరిలేరు నీకెవ్వరు చిత్రం లో విజయశాంతి నటించిన సమయంలో  ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ షిప్ లేదనే విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. మెంబర్షిప్ ఇవ్వకపోయినా విజయశాంతి ఎపుడు పెద్దగా పట్టించుకోలేదు అని ఆమె వ్యక్తిత్వం అలాంటిది అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: