కన్నడ స్టార్ హీరోల్లో ఒకరు అయిన కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సస్పెన్స్ , థ్రిల్లర్ , యాక్షన్ జోనర్ లో తెరకెక్కింది.  ఈ మూవీ 2 డి మరియు 3 డి వెర్షన్ లలో జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో , ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ గా నిలిచింది. మరి ఇప్పటి వరకు 5  రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రాంత్ రోనా మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 1.34 కోట్లు , సీడెడ్ : 43 లక్షలు , యూ ఏ : 41 లక్షలు , ఈస్ట్ : 26 లక్షలు , వెస్ట్ : 19 లక్షలు , గుంటూర్ : 29 లక్షలు , కృష్ణ : 25 లక్షలు , నెల్లూర్ : 13 లక్షలు , 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రాంత్ రోనా మూవీ 3.30 కోట్ల షేర్ , 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , అనూప్ బండరీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: