నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం క్రితం ఎంత మంచి వాడవురా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఎంత మంచి వాడవురా మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అలా ఎంత మంచి వాడవురా మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు .

మూవీ కి కొత్త దర్శకుడు మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది . అలా బ్లాక్ బాస్టర్ టాక్ రావడం తో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో తాజాగా కళ్యాణ్ రామ్  'బింబిసార పార్ట్ 2' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. బింబిసార పార్ట్ 2 బెటర్ ఫాంట సీ, అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో చాలా  భారీగా ఉంటుందని తాజాగా కళ్యాణ్ రామ్ చెప్పు కొచ్చాడు. దర్శకుడు వశిష్ట్ పై ఆ బాధ్యత ఉందని తాజాగా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. క్యాథరెన్, సంయుక్త మీనన్ బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: