టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా.. స్టూడియోస్ అధినేతగా.. హోస్ట్ గా... మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే  ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు..బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు షోను హోస్ట్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు నాగార్జున. అంతేకాదు ఆయన నటించిన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక వీటితో పాటు ఘోస్ట్ లాంటి మరికొన్ని సినిమాలలో నటిస్తున్నాడు నాగార్జున.ఇదిలావుంటే ఇక తాజా సమాచారం ప్రకారం నాగార్జున రాజకీయల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. 

ఇంతకీ  నాగార్జున ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనేగా సందేహం...?బయట జరుగుతున్న ప్రచారం ప్రకారంగా అయితే .. నాగార్జున వైసీపీ లో చేరబోతున్నారనే వార్తలు గుట్టుగానే గుప్పుమంటున్నాయి.అంతేకాదు  నాగ్ కు విజయవాడ పార్లమెంట్ టిక్కెట్టు ఇచ్చి పోటీకి దింపాలని చూస్తున్నారట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఇక  ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కాని.. కన్ పార్మ్ చేయడం కాని జరగలేదు.అయితే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకపోయినా.. ఆయన సపోర్ట్ వైఎస్ కుటుంబానికి ఉన్నట్టు అప్పుడప్పుడు హింట్లు ఇస్తూనే ఉన్నాడు నాగ్.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు నాగార్జున.ఇక  ఆయన అధికారంలో ఉన్నా.. లేకున్నా కాని... జగన్ కు సానుభూతి తెలుపుతున్నారు.అంతేకాకుండా  అప్పట్లో.. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని వైఎస్ జగన్ జైలుపాలైనప్పుడు, జైలులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.అయితే అంత ఇబ్బందుల్లో కూడా తనకు సపోర్ట్ గా ఉన్నందుకే నాగార్జునను రాజకీయల్లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారట.  అందుకు నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా...? అనేది చూడాలి మరి.ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాకు నటిస్తున్న ది ఘోస్ట్ మూవీ అక్టోబర్ 5న దసరా కానుక విడుదల కానుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: