సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది మృణాల్ ఠాకూర్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా సీత పాత్రలో మృణాల్ ఒదిగిపోయారనే చెప్పాలి..


ఆమె తప్ప మరొక హీరోయిన్ చేయలేరు అన్నట్లుగా మృణాల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ తో మృణాల్ కెమిస్ట్రీ సైతం వెండితెరపై అద్భుతం చేసింది. సీతారామం తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు మృణాల్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఫ్యూచర్ లో ఆమె క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.


పైకి చాలా సాఫ్ట్ గా కనిపించే మృణాల్ ఆలోచనలు చాలా వైల్డ్ గా ఉన్నాయి. ఇండియన్ సొసైటీ జీవన విధానం ఆమె దాటిపోయారు. పెళ్లి, భర్త వద్దు.. పిల్లలు మాత్రం కావాలి అంటుంది. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఆలోచనా ధోరణి విస్మయానికి గురి చేసిందట. ముప్పై ఏళ్ల వయసులో ఆడవాళ్లు డేటింగ్ చేయడం, రిలేషన్షిప్ పెట్టుకోవడం, పిల్లల్ని కనడం ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అలాంటి స్ట్రెస్ నేను తీసుకోవాలని అనుకోవడం లేదు. అమ్మాయిలు ఇలానే ఉండాలి. ఆచారాలు పాటించాలి అనే పాత చింతకాయ పచ్చడి పద్ధతులకు నేను అయితే కట్టుబడి ఉండను.


అలా అని హద్దులు దాటేసి ఏది పడితే అది చేసే ఈ తరం అమ్మాయిలా కూడా ఉండను. మరీ ఫాస్ట్ గా ఉన్నా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇప్పుడు సొసైటీ అంతటా అభద్రతా భావం ఉంది. అందుకే నాకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాను. నచ్చినట్లు ఉంటానని కుండబద్దలు కొట్టింది. మృణాల్ ఇంకా మాట్లాడుతూ… నమ్మకంగా ఉండే ఓ సెక్యూర్డ్ పర్సన్ అయితే నాకు కావాలి. మొగుడు మాత్రం వద్దు. సెక్స్ అసలే వద్దు. పిల్లలు మాత్రం కావాలి. తల్లి అనిపించుకోవాలి. నేను ఎప్పటికీ సింగిల్ మదర్ లా ఉండిపోతాని మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేశారట.


 

మృణాల్ వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సరోగసి, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాక పెళ్లి, భర్త లేకున్నా కొందరు తల్లి అవుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మృణాల్ ఇలాంటి కామెంట్స్ చేశారట.. కాగా మృణాల్ హిందీలో నాలుగు చిత్రాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆమె లేటెస్ట్ రిలీజ్ జెర్సీ డిజాస్టర్ అయ్యింది. సీతారామం తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: