సినిమా విడుదలైన తెలుగు సినిమా పది వారాల వరకు ఓటీటీలకు రాదు. కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా నిర్మాతలు అందరూ కలసి కూర్చుని తీసుకున్న నిర్ణయం ఇదే.


దీనిని ఎంత మంది పాటిస్తారు, నిజంగానే పాటించగలరా, అలా చేస్తే నష్టాలు రావా? ఇలా చాలా రకాల ప్రశ్నలు అప్పుడొచ్చాయి. అప్పుడు నిర్మాతల్లో కొందరు.. లేదు లేదు మేం మాట మీద నిబడతాం అని కూడా అన్నారట.. కానీ ఇప్పుడు చూస్తే ఆ మాటలకు తొలి తూట్లు పడుతున్నాయంటున్నారు.


'వాట్‌ లగా దేంగే', 'దేశాన్ని షేక్‌ చేస్తాం' అంటూ దాదాపు నెల క్రితం ఓ సినిమా వచ్చింది గుర్తుందా? మాకెందుకు గుర్తులేదు 'లైగర్‌' సినిమానే కదా అంటారా. అవును, ఆ సినిమానే ఇప్పుడు విడుదలై సరిగ్గా నెల కూడా దాటకుండానే ఓటీటీల్లోకి వచ్చేస్తోంది. సెప్టెంబరు 22న సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ రోజు దీనికి సంబంధించి కంప్లీట్‌ ఇన్ఫో వస్తుంది అంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాలేదు అనేది ఒకటైతే..


 


తర్వాత కూడా ఇలాంటి ఓటీటీ రిలీజ్‌లు ఉంటాయి అనేది మరో విషయం. థియేటర్లలో డబ్బులు వసూలు విషయంలో బొక్క బోర్లా పడ్డ 'లైగర్‌' మరి ఓటీటీలో అయినా 'వాట్‌ లగా దేంగే' అనే మాటకు న్యాయం చేస్తాడేమో చూడాలి. విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌, ఛార్మి కాన్ఫిడెన్స్‌కి ఓటీటీలో అయినా విజయం దక్కుతుందేమో చూడాలి. సినిమా ఫలితంపై చాలా రోజులు కామ్‌గా ఉన్న విజయ్‌, ఛార్మి, పూరి జగన్నాథ్‌ ఇటీవల మాట్లాడారట.


 


అయితే 'లైగర్‌' ఓటీటీ రిలీజ్‌కి ప్రచారాం చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే అద్భుతం అనే చెప్పాలి. అయితే థియేటర్‌లో సినిమా విజయం సాధించి ఉంటే.. 'లైగర్‌' కోసం విజయ్‌ మరింత యాటిట్యూడ్‌తో ప్రచారం చేసేవాడు. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు పూరి జగన్నాథ్‌. తన పూర్‌ రైటింగ్‌, డైరక్షన్‌ స్కిల్‌తో దెబ్బ తీశారు. విజయ్‌ మాత్రం తన పాత్ర కోసం చాలా కష్టపడి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: