మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మి గౌతమ్ కు ఆ సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించిన రేష్మి గౌతమ్ ఈ కామెడీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.  జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజీ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక మూవీ లలో నటించింది.

రష్మి గౌతమ్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించలేదు. అయినప్పటికీ రేష్మి గౌతమ్ కి సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. దానితో ప్రస్తుతం రష్మి గౌతమ్ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ,  సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రేష్మి గౌతమ్ "బొమ్మ బ్లాక్ బాస్టర్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ లో నందు హీరోగా నటించాడు. రాజ్ విరాట్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రేపు అనగా నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి ఈ మూవీ తో అయినా రేష్మి గౌతమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో ... లేదో ... చూడాలి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే రేష్మి గౌతమ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: