కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న విశాల్  గురించి మనందరికీ తెలిసిందే. విశాల్ కిఇప్పుడు 45 ఏళ్లు. అయితే  45 ఏళ్లు వచ్చిన విశాల్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. అయితే గతంలో తెలుగు అమ్మాయి మనీషా రెడ్డిని ప్రేమించిన ఈయన ఆమెతో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లి వరకు వెళ్లకుండా వీరి బంధం మధ్యలోనే తెగిపోయింది. దాని అనంతరం విశాల్ కు పెళ్ళికి సంబంధించిన అనేకమైన  ప్రశ్నలు ఇప్పటివరకు ఎదురవుతూనే ఉన్నాయి. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా ఎప్పుడూ తప్పించుకుంటూ నే ఉన్నాడు.

అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి తో ఆయన పెళ్లి ని  ముడిపెట్టాడు విశాల్.ఇక పెళ్లి గురించి ప్రశ్నించగా వివాహం అనేది ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది.అంతేకాదు  పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం నా కెరియర్ పైనే ఉంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వచ్చే ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా అందుకు విశాల్ ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని సరదాగా బదులు ఇవ్వడం జరిగింది. దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి .అయితే వయసులో విశాల్ కంటే ప్రభాస్ చిన్నోడు.

అయినప్పటికీ ప్రభాస్ పెళ్లి తో విశాల్ ముడి పెట్టడంతో..ఇది కాస్త ఓవర్గా లేదా అంటూ ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు సైతం చేస్తున్నారు. అంతేకాదు కొందరు ప్రభాస్ పెళ్లి వరకు నువ్వు వెయిట్ చేస్తే ముసలోడు అయిపోతావు అంటూ ఫన్నీగా కామెంట్లో చేస్తున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వార్త విన్న అనంతరం విశాల్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి అంతేకాదు ప్రభాస్ తో ఈయన పెళ్లి ముడి పెట్టడం ఏంటి అని కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: