సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అమ్మడు భారీ క్రేజ్ ని అందుకుంది. ఒక 'లైలా కోసం' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా అరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ప్లాప్ గా మిగిలింది. అదే సమయంలో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీలోనే హృతిక్ రోషన్ లాంటి అగ్ర హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. 

హృతిక్ రోషన్తో కలిసి 'మొహేంజోదారో' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఈ సినిమా బాలీవుడ్లో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో పూజ హెగ్డే కు బాలీవుడ్ ఎంట్రీ అచ్చి రాలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత బాలీవుడ్లో 'హౌస్ ఫుల్ 4' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి సక్సెస్ను సాధించింది. కానీ అక్కడ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో పూజా హెగ్డే చేసింది ఓ పనిమనిషిలాంటి పాత్రే. అందుకే సినిమా హిట్ అయిన పూజ హెగ్డే కి అక్కడ ఏమాత్రం స్టార్ డం రాలేదు. ఇక హౌస్ ఫుల్ 4 దర్శకుడు రోహిత్ శెట్టి తో ఇటీవల 'సర్కస్' అనే మరో సినిమా చేసింది పూజ హెగ్డే.

బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ సరసన నటించిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి భారీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేవలం 30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో పూజ హెగ్డే ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది. అంతేకాదు మరోసారి రోహిత్ శెట్టి పై పూజా హెగ్డే పెట్టుకున్న నమ్మకం సైతం వృధా అయ్యింది. ఈ సినిమా దెబ్బతో ఇప్పట్లో పూజా హెగ్డే కి బాలీవుడ్లో అవకాశాలు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి 'కీసికా భాయ్.. కీసికా జాన్' అనే సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. ఈ సినిమా అయినా  విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టిని రెండవసారి నమ్మి పూజా హెగ్డే నిండా మునిగిపోయిందని అక్కడి సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటినుండి అయినా దర్శకుడుని నమ్మకుండా కథను నమ్మి సినిమాలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: