ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరిస్తున్న టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ లలో సత్యదేవ్ కూడా ఒకరు. ముఖ్యంగా తిమ్మరసు, గాడ్సే విజయంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన జ్యోతి లక్ష్మి సినిమాలో కూడా నటించి అంతకుముందు భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇటీవల ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించి కొంతవరకు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈయన.. ఇటీవల తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం సత్యదేవ్ కృష్ణమ్మ అనే ఇంటెన్స్ యాక్షన్ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ క్రమంలోనే ఇప్పుడు తన 26వ సినిమాని కూడా అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాదు ఈరోజు ఈ సినిమాకు సంబంధించి మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. గత ఏడాది సత్యదేవ్ 26 క్రైమ్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోంది అని ఈ కొత్త చిత్రాన్ని కూడా ప్రకటిస్తూ సత్యదేవ్ తన ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.  అంతే కాదు ఆ తర్వాత అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్లో రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు,  గుర్రం కనిపిస్తాయి. ఇవే కాకుండా చిత్ర నిర్మాతలు వర్కింగ్ టైటిల్లో పోస్టర్ పై స్టార్ మార్కులు కూడా జోడించడం జరిగింది ముఖ్యంగా చిన్నచిన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమా కౌబాయ్ మూవీ కేటగిరీకి చెందిన అన్నట్లుగా ప్రేక్షకులలో అంచనాలను కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమా ఈరోజు మూవీ టైటిల్ విడుదల చేయబోతున్నారు కాబట్టి ఏ నేపథ్యంలో తెరకెక్కబోతోందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా.. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాల సుందరం అలాగే దినేష్ సుందరం నిర్మాతలుగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: