సినిమా ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లు ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా మారిపోయాయి. కాగా ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక సినిమాతో మరొక సినిమాని ముడి పెడుతూ సినిమాలు చేయడం అని తెలుస్తుంది..

లోకేష్ కనగరాజ్ ప్రాపర్ సినిమాటిక్ యూనివర్స్ ని అయితే క్రియేట్ చేశారు. ఖైదీ మరియు విక్రమ్ చిత్రాలకు లింక్ సెట్ చేశాడు. దీన్నికి లియో సినిమాకి ముడిపెట్టబోతున్నారని తెలుస్తుంది. అలాగే కేజీఎఫ్ యూనివర్స్, తెలుగులో హిట్ యూనివర్స్ కూడా రాబోతుంది. దర్శకుడు శైలేష్ కొలను దీనిని సృష్టించారు. కాగా ఇప్పటికే హిట్ యూనివర్స్ నుంచి రెండు సినిమాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.

తొలి సినిమాలో విశ్వక్ సేన్ నటించాడు. రెండో పార్ట్ లో అడవి శేష్ హీరోగా అయితే నటించారు. ఇక మూడో భాగంలో నాని నటిస్తున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే ఈ సినిమాని కూడా ప్రకటించారు. కాగా తాజాగా హిట్4 సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారటా డైరెక్టర్ శైలేష్ కొలను.పార్ట్ 4 లో ఏకంగా అగ్ర హీరోని తీసుకోవాలి అని ఆయన అనుకుంటున్నారట. ఆ అగ్ర హీరో మరెవరో కాదు బాలకృష్ణ. హిట్4 సినిమాని బాలకృష్ణతో చేయాలని అయితే భావిస్తున్నారట శైలేష్ కొలను. ఇప్పటికే బాలయ్యకి స్క్రిప్ట్ కూడా రెడీ చేసి, బాలయ్య బాబు కి కథ వినిపించగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.అయితే దీని పై దర్శకుడికి ఇంకా ఎలాంటి సమాధానం  ఇవ్వలేదని అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న కొత్త సినిమాల ప్రకటనలు అయితే రానున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఎన్బీకే108 చిత్రంలో ఆయన నటిస్తున్నారు బాలయ్య. ఈ సినిమా టైటిల్ని బర్త్ డే రోజు ప్రకటించనున్నారని సమాచారం.. అలాగే హిట్ 4 కి సంబంధించిన అప్డేట్ కూడా బాలయ్య బాబు పుట్టినరోజు రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: