డబ్బు సంపాదనకు విద్య కు ఎటువంటి సంబంధం లేదు బాగా సంపాదించిన వారు అంతా బాగా చదువుకున్న వారు అని భావించడం ఒక భ్రమ. అయితే ఈ డబ్బు సంపాదనకు ఆర్ధిక విద్యలో మంచి నైపుణ్యం ఉండాలి. ఆర్ధిక విద్య అంటే మన దగ్గర ఉన్న డబ్బును ఒకేచోట పెట్టుబడిగా మార్చకుండా వివిధ రంగాలలో పెట్టుబడిగా మార్చి వ్యాపారం చేయగలిగిన వ్యక్తులకు మాత్రమే సంపద వస్తుంది అని అంటారు.


అయితే సంపాదనకు సంబంధించి తరగని గని భూమి పై వ్యాపారం. ఈ ప్రపంచంలో మూడు వంతులు నీళ్ళు ఉంటే ఒక వంతు మాత్రమే భూమితో నిండి ఉంది. ప్రస్తుత భారతదేశ జనాభా 130 కోట్లు దాటి ఉండటంతో ఎన్ని ఆర్ధక మాన్యాలు వచ్చినా కరువు కాటకాలు ఏర్పడినా కరోనా లాంటి ఘోర విపత్తులు వచ్చినా కొద్ది కాలం పాటు భూమి విలువలు తగ్గుతాయి కానీ శాస్వితంగా భూమి విలువలు పెరగక పోవడం జరుగదు. 


అందుకే చాలామంది ధనవంతులు కనీసం తమ సంపాదనలో 30 శాతం వరకు ఇళ్ళ స్థలాలు పొలాల పై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రపంచంలో ఏ వస్తువా విలువ అయినా శాస్వితంగా తగ్గిపోతుంది కానీ భూమి విలువ శాస్వితంగా తగ్గిపోవడం జరగదు. అందువల్లనే ఎన్ని వైపరీత్యాలు ఎదురైనా ఇప్పటికీ భూమి పై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 


మనం కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బును ఎక్కడపడితే అక్కడ అధిక లాభాలు ఆశించి పెట్టుబడి పెట్టకుండా కాస్త తెలివిగా ఆలోచించి తరగని గని భూమి పై పెట్టుబడి పెట్టేవారు అంతా ఆర్ధిక విద్యలో మంచి ఉన్నత చదువులు చదువుకున్న వారితో సమానం అని అంటారు. ప్రతి వ్యక్తి గెలిచి తీరాలి అన్న లక్ష్యంతో అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. అయితే భూమిని నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా అసలుకు నష్టపోడు అంటూ ఐశ్వర్యానికి ఆత్మబంధువు గా భూమిని పరిగణిస్తూ ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: