అందరి అంచనాల ప్రకారం ఈవారం షేర్ మార్కెట్ శుభారంతో ప్రారంభం అయి నిఫ్టీ 12 వేల స్థాయికి చేరుకున్నా చాలామంది మదుపర్లు తమ షేర్లకు సంబంధించి లాభాలు స్వీకరించడంలో బిజీగా ఉండటంతో నిఫ్టీ స్వల్ప నిరోధాన్ని ఎదుర్కుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో మరికొద్ది రోజులపాటు నిఫ్టీ ఈ స్థాయిలో నిలదోక్కుకున్నప్పుడు మాత్రమే అప్ ట్రెండ్ కు అవకాశం ఉంటుందని అందువల్ల చిన్నతరహా ఇన్వెష్టర్లు ఈవారం అంతా చాల జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.


ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఈవారం మార్కెట్ లో ఫ్లోటింగ్ స్టాక్ లు తక్కువగా ఉండటం ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ ఇంకా మరింత నిలదొక్కుకోవాలి అంటే సాముకూల సంకేతాలు అంతర్జాతీయ షేర్ మార్కట్ నుండి రావాలి అని అంటున్నారు. దీనికితోడు దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్ - విప్రో - హెచ్ సి ఎల్ - మైండ్ ట్రీ – టాటా కమ్యూనికేషన్స్ – డిమార్ట్ వంటి సంస్థల వ్యాపార ఫలితాలు ఎలా ఉంటాయి అన్న ఆతృతతో షేర్ మార్కట్ ఆచితూచి అడుగులు వేస్తోంది.


ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ గురించి క్లారిటీ వచ్చేదాకా మార్కెట్ చాల నెమ్మదిగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికితోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను బట్టి షేర్ మార్కెట్ లో చాల మార్పులు రాబోతున్నాయి. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ప్రభుత్వరంగ బ్యాంక్ లు అయినా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - యుకో బ్యాంక్ - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు బాగా పడిపోవడంతో ఈప్రభుత్వ బ్యాంక్ లకు ఏమైంది అంటూ చాలామంది లోతైన విచారణలు చేస్తున్నారు.


అయితే ఈవారం మళ్ళీ బంగారం వెండి లకు అప్ ట్రెండ్ కొనసాగే ఆస్కారం ఉందని అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా సిమెంట్ ఐటి ఫార్మా రంగాలకు సంబంధించి ఈవారం విడుదల కాబోతున్న ఫలితాలను బట్టి ఈ రంగాలలోని షేర్లు విపరీతంగా ప్రభావితం కానున్నాయి. ఏది ఏమైనా చాలామంది ఇన్వెష్టర్లు ఇలాంటి పరిస్థితులలో ఉండటం కంటే లాభాల స్వీకరణకు గల అవకాశాల గురించి ఎదురు చూస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: