కరోనా పరిస్థితుల నేపధ్యంలో వివిధ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడమే కాకుండా తమ ఉద్యోగ నియామక విషయాలలో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. క్రితంలా సాంప్రదాయ చదువులకు వాటికి సంబంధించిన స్కిల్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త స్కిల్స్ ఉన్న అభ్యర్ధుల కోసం కార్పోరేట్ కంపెనీల అన్వేషణ కొనసాగుతోంది.
ప్రస్తుతం అన్ లాక్ డౌన్ తరువాత తిరిగి భారతీయ ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతున్న పరిస్థితులలో అనేక కంపెనీలు తిరిగి కొత్త ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నాయి. కార్పోరేట్ వర్గాల అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 3.5 లక్షల జాబ్ ఓపెనింగ్స్ రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ-లెర్నింగ్ హెల్త్ కేర్ హెచ్‌ఆర్ ఫిన్‌టెక్ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయి.
ఐటీఈఎస్ తయారీ రంగం బీఎఫ్‌ఎస్‌ఐ టెలికం సెమికండక్టర్ల పరిశ్రమలలో గ్రోత్ బాగా ఉండటంతో రానున్న కొద్దిరోజులలో ఈ పరిశ్రమలలో అనేక ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లో 14 శాతం సాఫ్ట్‌వేర్ రంగంలో 10 శాతం కస్టమర్ సర్వీసింగ్ విభాగంలో 8 శాతం మార్కెటింగ్‌లో 5 శాతం సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్ కు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నఅంచనాలు వస్తున్నాయి. రానున్న కొత్త సంవత్సరం జనవరి మార్చి మధ్య ఈ కొత్త నియామకాలు జరగవచ్చని అంటున్నారు. ఆఫ్ క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే గత ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ తో పోల్చితే ఈ ఏడాది 75 శాతం మెరుగైన పరిస్థితులు ఉండవచ్చని క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన ఉద్యోగుల వేతనాలు దాదాపు 10 శాతం తక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఈ ఉద్యోగాల నియామకాలు అన్నీఅభ్యర్ధులు కనపరిచే స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది. దీనితో పైన పేర్కున్న విభాగాలలో తమ స్కిల్స్ పెంచుకోవడానికి యువతరం బాగా కష్టపడకుండా అవకాశాలు వచ్చే పరిస్థితులు లేవు అంటూ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి