రైతులకు రైతు భరోసా, పిఎం కిసాన్ కింద 13,500 రూపాయలు సైతం ప్రతి ఏడాది జమ అవుతూనే ఉన్నది.. గత కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తల పైన తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా ప్రకటన చేయడంతో రైతులకు ఆశలు నిరాశలుగా మిగిలాయని చెప్పవచ్చు. మరి ప్రభుత్వం పీఎం కిసాన్ పెంపు పైన ఏం చెప్పింది అని అంశం గురించి తెలుసుకుందాం.


మోడీ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ స్కీంని తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బుల వల్ల అన్నదాతలకు కాస్త ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రతి ఏటా కూడా పిఎం కిసాన్ కింద 6000 ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం.. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ల కారణంగా ఇటీవల పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని చాలా ఆశతో ఉన్నారు రైతులు.. ఈ పెంపు విషయం పైన స్పష్టత ఇవ్వడం జరిగింది.


పీఎం కిసాన్ అందిస్తున్న డబ్బులను పెంచే ప్రసక్తే లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.. దీనివల్ల రైతుల అంచనాలు సైతం నిరాశలుగానే మిగిలిపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో పిఎం కిసాన్ యోజన పథకం కింద డబ్బులు పెరిగే అవకాశం లేదు... పీఎం కిసాన్ కింద 6000 రూపాయలకు మించి పెంచే ప్రతిపాదన లేదంటూ కూడా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి కేంద్ర మంత్రి తోమర్ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు సమాచారం.. 2018 నుండి పీఎం కిసాన్ పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 15 వాయిదాలలో చెల్లించడం జరిగింది. దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: