గత కొన్ని సినిమాలుగా ఫ్లాప్ సినిమా లు చేస్తున్న సూర్య కి ఆకాశం నీ హద్దురా సినిమా సూపర్ హిట్ ఇచ్చింది అని చెప్పుకోవాలి. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో అందరు నిర్మాతలు తమ సినిమాలను OTT లకి ఇచ్చేస్తున్నారు. ఈ నేసథ్యంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా, ఈ సినిమా కి మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు OTT లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. దాంతో ఈ సినిమా పై కూడా ఎవరు అంచనాలు పెట్టుకోలేదు కానీ సినిమా చూసిన ప్రేక్షకులు హిట్ అని చెప్తున్నారు.