మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా వరకే తండ్రి ఇమేజ్ తో తెరంగేట్రం చేసి ఆ తరువాత సొంత టాలెంట్ తోనే సినిమాలు చేశాడని చెప్పొచ్చు.. మొదటి సినిమా చిరుత తో తనలోని యాక్టింగ్ ని, డాన్సింగ్ ని చూసి ప్రేక్షకులు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అన్నారు.. రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటివరకు ఏ సినిమా చేయని రికార్డులను సృష్టించాడు.. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.