వరుస ఫ్లాప్ లతో సతమతమవుతన్న శ్రీనువైట్ల చాల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా ని అనౌన్స్ చేశాడు.. మంచు విష్ణు హీరో గా ఈ సినిమా ని అనౌన్స్ చేయగా 13 ఏళ్ళ క్రితం ఇదే కాంబోలో వచ్చిన ఢీ ఎంత పెద్ద హిట్టో మూవీ లవర్స్ మర్చిపోలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సినిమా తాలూకు వీడియోలు, స్క్రీన్ షాట్లని మేమ్స్ రూపంలో వాడుకుంటూనే ఉన్నారు. అంతగా కామెడీలో ఓ డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఢీ. దానికి సీక్వెల్ గా వీరి కాంబో లో ఈ ఢీ అండ్ ఢీ అనే సినిమా తెరకెక్కబోతుంది.