హ్యాపీ డేస్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరో నిఖిల్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ సినిమా తో పూర్తి స్థాయి హీరో అనిపించుకున్న నిఖిల్ కెరీర్ ప్రస్తుతం అంతగా లేదని చెప్పాలి.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో హిట్ కొట్టిన నిఖిల్ గత రెండు మూడు చిత్రాలను భారీ ఫ్లా గా నిలిపాడు. అయన నటించిన కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలు పెద్ద గా నచ్చలేదు. దాంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలని తనకు కార్తికేయ హిట్ ఇచ్చిన చందు మొండేటి తో కార్తికేయ సీక్వెల్ ని చేస్తున్నాడు.