ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పూర్తి కావొచ్చింది.వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చ్నేమ సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా పనులు సాగుతున్నాయి.. బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగా సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న తదుపరి సినిమా మలయాళం రీమేక్ పూజ కార్యక్రమలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో సాయి పల్లవి- ఐశ్వర్యారాజేష్ లను కథానాయికలుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పన్ కోశియుమ్ సినిమా కి ఇది తెలుగు రీమేక్..