టాలీవుడ్ బొద్దుగుమ్మ మెహ్రీన్ ఇప్పుడు డూ ఆర్ డై పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు.. ఈ సంవత్సరం F2 లాంటి సూపర్ హిట్ వచ్చిన ఆమెకు ఆ హిట్ తాలూకు క్రెడిట్ మాత్రం దక్కలేదు.. మల్టీ స్టారర్ చిత్రం కావడంతో అందులోనూ ఇద్దరు హీరోయిన్ లు రావడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.. అయితే ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంది.. మెహ్రీన్ అందచందాలకు ఏమాత్రం కొదువలేదు.. బక్కపలచని ఫిగర్ కాకుండా తెలుగు వారు మెచ్చే విధంగా ఎంతో బొద్దుగా ఉంటుంది.