రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.. వీరి కాంబో లో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే మరో సినిమా చేయాలనీ ఇరువురు డిసైడ్ అయ్యారు.. అందుకు తగ్గట్లే RRR తర్వాత ఈ సినిమా ని పట్టాలెక్కనున్నాడు.. ఇటీవలే అల్లు అర్జున్ అలవైకుంఠపురం అనే సినిమాతో టాప్ మోస్ట్ హిట్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో అని అభిమానులు వేచి చుస్తునారు.