పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ అనుకున్న దానికంటే ముందే రాబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.. శ్రుతి హసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీ రామ్ దర్శకుడు కాగ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఈ సినిమా రీమేక్ కాగ ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. రాజకీయాలకు వెళ్లి చిన్న పాజ్ ఇచి మరీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.