ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేసి ఉన్నాడు. రాధే శ్యామ్ సినిమా ఇప్పటికే పూర్తి కావొచ్చింది.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొని ఆ సినిమా ను పూర్తి చేస్తాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మిర్చి సినిమా తర్వాత కమర్షియల్ సినిమాలు చేసి చాలా ఏళ్ళయిపోయింది.. బాహుబలి పౌరాణికం కాగా, సాహో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు.