రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు.. ఈ సంక్రాంతి కి తన రాబోయే సినిమా టీజర్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ టీజర్ కాదు కదా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.. దాని ఊసు కూడా లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇది తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన ప్రభాస్ ఒక్క సినిమా కి సంభందించిన లుక్ ని కూడా విడుదల చేయలేదు. ఇక వీటిలో ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా రాధే శ్యామ్.. రాధా కృష్ణ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..