ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా తమన్ పేరే వినిపిస్తుంది. తెలుగు నుంచి వచ్చే క్రేజీ సినిమాలు అన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయంటే తమన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు తమన్. రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతున్నాడు. అలవైకుంఠపురం సినిమా తో ఒక్కసారిగా తమన్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఆ సినిమా లోని అన్ని పాటలు హిట్ కావడంతో ఇతరభాషలనుంచి కూడా ఆయనకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. ట్యూన్లు కాపీ అంటూ ఎలాంటి విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా దర్శక నిర్మాతలు తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవం విశేషం..