బుల్లితెరపై కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. సుధీర్ రష్మీ, వర్ష ఇమ్మానుయేల్, అఖిల్ మోనాల్, అవినాష్ అరియనా.. ఇలా బుల్లితెరపై ఈ జోడీలు ప్రేక్షకులను ఎంతో అలరిస్తాయి. అయితే ఇది గమనించిన ఛానల్స్ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వారిపై ప్రోగ్రామ్స్ ని చేస్తున్నాయి. అవి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో వారు నిజజీవితంలో కూడా నిజంగా లవ్ చేసుకుంటున్నారా అన్న డౌట్ అందరికి వస్తుంది.. దీనిపై వారు ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ షో లలో లవర్స్ మాదిరి నటిస్తుండడం తో ప్రేక్షకులు వాళ్ళ మధ్య ఏం లేదు అని ఎలా నమ్ముతారు..