ఇద్దరి మధ్య బ్రేక్ అప్ అయినా వ్యక్తులు కలవడం, కల్సి పనిచేయడం ఏ రంగంలో అయినా ఆసక్తికరంగానే ఉంటుంది.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి సిట్యుయేషన్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటుంది.. ప్రేమ వ్యవహారాలు, విడిపోవడాలు ఇండస్ట్రీ కి కొత్త కాకపోయినా విడిపోయిన తర్వాత కలిసి పనిచేయడమనేది ఓ కొత్త రకం అనుభవం.. కోలీవుడ్ లో ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ ప్రేమజంట శింబు, నయనతార విడిపోయి దాదాపు పదేళ్లు కావొస్తుంది.. అప్పటినుంచి వీరిద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడ్డ సందర్భాలు, కలిసిన సమయం చాల తక్కువ..