టాలీవుడ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు రెండో పెళ్లి చేసుకోనున్నాడనే వార్త టాలీవుడ్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది. పలు సినిమాల్లో హీరోగా చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే అహం బ్రహ్మస్మిం అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో చేస్తుండగా ఈ సినిమా పనులు చక చక అవుతున్నాయి. కొన్ని రోజులు రాజకీయాల్లో కూడా ఉన్న మనోజ్ అక్కడ కూడా ఎక్కువ రోజులు నిలువలేదు.. దాంతో తిరిగి సినిమాల్లోకి వచ్చాడు..