టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఆమె టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమెకు తొలి ఛాన్స్ కూడా విచిత్రంగా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణతో అప్పట్లో దర్శకుడు చిట్టిబాబు రైతు భారతం అనే సినిమా తీయడానికి రెడీ అయ్యారు. మొదటి హీరోయిన్ గా వాణి విశ్వనాథన్ ని తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా మంచి నటిని సెలక్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో చాలామందిని చూస్తుండగా, అప్పట్లో ఎడిటర్ గా పనిచేస్తున్న రామయ్య వెంటనే డైరెక్టర్ చిట్టిబాబు కి ఫోన్ చేసి మీకు కావాల్సిన నటి బెంగళూరులో ఉందని చెప్పారు.