భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. న్యూ ఇయర్ సందర్భంగా నితిన్ రంగ్ దే టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేసింది. నిజానికి నెలల క్రితమే సంక్రాంతికి తమ సినిమా వస్తుందని చెప్పింది రంగ్ దేనే. ఆ తర్వాత మిగిలినవాళ్లు ఒక్కొక్కరుగా అనౌన్స్ మెంట్లు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.