లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. తొలి చిత్రం నుంచి ఎంతో వైవిధ్యం చూపించే సుకుమార్ తన అన్ని సినిమాలతో ప్రేక్షకుల ఇంటలిజెన్స్ ను పరీక్షిస్తూనే ఉంటాడు.. ఎమోషన్స్ ని టెక్నికల్ గా వాడుకునే దర్శకుడుగా సుకుమార్ టాలీవుడ్ లో నిలిచిపోతాడు.. అయన గత చిత్రం అందుకు భిన్నంగా రస్టిక్ గా రంగస్థలం సినిమా ను తెరకెక్కించి హిట్ కొట్టాడు.. తన పంథా కు భిన్నంగా సుకుమార్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పాలి..