అభిమానం అనేది బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు అది హద్దులు దాటితేనే దాన్ని అభిమానం అని కాకుండా ఉన్మాదం అని పేరు పెట్టాల్సి వస్తుంది.. అభిమానుల పేరుతో కొంతమంది ఆకతాయిలు చేసే అరాచకం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా ఫిమేల్ సెలెబ్రిటీలు అభిమానులు అని చెప్పుకునే కొంతమంది ఆకతాయిల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి వల్ల నిజమైన అభిమానులు కూడా తమ ఆరాద్యమైన నటులను కలుసుకోలేకపోతున్నారు.