తొలిసారిగా ప్రేక్షకుల సెంటిమెంట్ ను కాకుండా, వైవిధ్యాన్ని ఆదరిస్తారనే ఆలోచనతో గీతా ఓ కొత్త తరహా కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో కార్తికేయ పాత్రతో పాటు, హీరో తల్లి ఆమని పాత్ర కూడా కీలకంగా వుంటుందని తెలుస్తోంది. ఇటీవలే ఉప్పెనలో ఓ షాకింగ్ పాయింట్ ను కథలో చేర్చారు. జనం చూసారు. చావు కబురు చల్లగాలో కూడా కొన్ని షాకింగ్ పాయింట్లు వున్నాయని తెలుస్తోంది. సినిమా కథలు ఇలాగే వుండాలి, పాత్రలు ఇలాగే ఆలోచించాలి అనే రోటీన్ థాట్ ప్రాసెస్ కు విభిన్నంగా ఈ కథ చెప్తున్నారు.