రావు రమేష్..టాలీవుడ్ కి దొరికిన ఆణిముత్యం లాంటి నటుడు.. తండ్రి వారసత్వాన్ని పుణికి తెచ్చుకుని తనకంటూ మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న నటుడు రావు రమేష్.. రావు గోపాల్ రావు కి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చినా కొద్దీ రోజుల్లోనే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. తొలి సినిమా కొత్త బంగారు లోకం సినిమాలో ఎవరీ నటుడు భలే చేశాడు అనిపించుకున్నాడు. ఆ సినిమాలో లెక్చరర్ పాత్రలో అయన చూపించిన హుందాతనం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు.. ప్రకాష్ రాజ్ కి రీప్లేస్ ఎవరా అని చూస్తున్న టైం లో సమాధానం లా దొరికాడు రావు రమేష్..