బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న నటుడు మెహబూబ్.. షో ఆసాంతం తనదైన శైలి లో అలరించిన మెహబూబ్ బయటకి వెళ్ళేటప్పుడు టీవీ ప్రేక్షకులను అందరిని ఏడిపించిన ఎపిసోడ్ ఇప్పటికీ అందరికి కంట నీరు పెట్టిస్తుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో మెహబూబ్ కి ఏ కంటెస్టెంట్ కి దక్కని అదృష్టం దక్కింది. సాక్షాత్తు మెగా స్టార్ చిరంజీవి మెహబూబ్ కి బిర్యానీ వండి తెచ్చివ్వడం, అయన చేస్తున్న ఆచార్య సినిమాలో ఓ క్యారెక్టర్ ఇవ్వడం మెహబూబ్ కి అదృష్టం అని చెప్పాలి..